05-12-2024 02:28:42 AM
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): పవర్‌గ్రిడ్ సదరన్ రీజియన్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్(ఎస్‌ఆర్‌టీఎస్) ఈడీగా ఎ.నాగరాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇది వరకు గురుగ్రామ్‌లోని పవర్‌గ్రిడ్ కార్పొరేట్ కార్యాలయంలో ఈడీగా పనిచేశారు. ఓయూ నుంచి ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయిన నాగరాజు ఎన్టీపీసీలో ట్రైనీ ఇంజినీర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. 1991లో పవర్‌గ్రిడ్‌లో ఇంజినీర్‌గా చేరిన ఆయన బెంగళూరు, హైదరాబాద్, నాగ్‌పూర్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు.