05-12-2024 02:25:29 AM
* కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్, డిసెంబర్ ౪ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ దృష్టిలో గురుకుల విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టడం కాంగ్రెస్ పార్టీకి ఏడాదిలో లభించిన విజయమని.. విద్యార్థుల చావులు వారికి ఉత్సవమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలివ్వకపో వడం కాంగ్రెస్ సర్కారు విజయమని, వారికి సంకెళ్లు వేయడం ఉత్సవమని విమర్శించారు. బుధవారం బండి సంజయ్ ఎక్స్ వేదికగా ప్రభుత్వ విజయోత్సవాలపై విమర్శలు చేశారు.
రైతులను మోసం చేయడం, వారికి ఉరితాళ్లు వేయడం, ఆడబిడ్డలను ఆగం చేయడం, వారి కన్నీళ్లు విజయోత్సవాలుగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇండ్లు ఇస్తామని మో సం చేయడం, ఉన్న ఇండ్లు కూల్చేయడం, రుణమాఫీ చేస్తామని మాట తప్పడం, అప్పులకు నోటీసులివ్వడం ఏడాదిలో పాలనలో సాధ్యమైనట్టు తెలిపారు. ఏడాది అరాచక పాలనే కాంగ్రెస్ విజయమా? ప్రజల చావు లు, గోసలే ఉత్సవమా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నవి విజయోత్సవాలు కావని... ఇవి వికృత ఉత్సవాలని ఆరోపించారు.