calender_icon.png 22 August, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిస్మస్‌కు ప్రత్యేక రైళ్లు

05-12-2024 02:30:05 AM

  1. సికింద్రాబాద్ నుంచి బ్రహ్మాపూర్, విశాఖకు.. 
  2. రేపటి నుంచి ౩౦వ తేదీ వరకు నడపనున్న ద.మ.రైల్వే

హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): క్రిస్మస్ సందర్భంగా ద.మ.రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నది. ఈ నెల 6 నుంచి 30వ తేదీ వరకు సికింద్రాబాద్ (ఒడిశా), సికింద్రాబాద్ విశాఖపట్టణం మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి. ఈ నెల 6, 13, 20, 27 తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 8.15 గంటలకు రైలు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు బ్రహ్మాపూర్ చేరుకుంటుంది.

నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెన పల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, ఇచ్చాపురం స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది. తిరుగు ప్రయాణంలో 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 4.35 గంటలకు బ్రహ్మాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.35 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది.

సికింద్రాబాద్ విశాఖపట్టణానికి.. ఈ నెల 8, 15, 22, 29వ తేదీల్లో సాయంత్రం 4.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటలకు విశాఖపట్టణానికి చేరుకుంటుంది. ఇదే రైలు 9, 16, 23, 30 తేదీల్లో రాత్రి 7.50 గంటలకు విశాఖపట్టణంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగనుండగా.. రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించినట్టు అధికారులు తెలిపారు.