6 June, 2026 | 2:51 PM

ఆప్యాయంగా పలకరిస్తూ.. సమస్యలు వింటూ..!

06-06-2026 01:46 PM

అచ్చంపేట: జీనుకుంట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ప్రజలతో ఆప్యాయంగా మమేకమై వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. సభకు వచ్చిన గ్రామస్థులను స్వయంగా పలకరిస్తూ, ప్రతి సమస్యను నిశితంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వృద్ధులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ సమస్యలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ గ్రామ సభ కొనసాగింది.