3 March, 2026 | 7:34 PM

ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

03-03-2026 12:38 AM

జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు 

మెదక్, మార్చి 2(విజయక్రాంతి): జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, జిల్లాలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వివాదాలు, పోలీస్ సంబంధిత ఇబ్బందులను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రా వు కు నేరుగా విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతి ఫిర్యాదుదారునితో వ్యక్తిగతంగా మాట్లాడి, వారి సమస్యలను సమగ్రంగా తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులను క్షుణ్నంగా పరిశీలించి, తక్షణమే పరిష్కార చర్యలు తీసుకునేలా సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్‌ఇన్స్పెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొన్ని అంశాలపై సంబంధిత ఎస్హెచ్‌ఓలతో ఫోన్ ద్వారా మా ట్లాడి, వేగవంతమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడు తూ, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎలాంటి పైరవీలు అవసరం లేకుండా నేరుగా పోలీస్ అధికారులను సంప్రదించాలని తెలిపారు. చట్టపరమైన మా ర్గంలో ప్రతి ఒక్కరికీ న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా ప్రజల కోసమేనని, ఎవరి జోక్యం లేకుండా నిర్భయంగా తమ సమస్యలను వెల్లడించాలని ప్రజలను కోరారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఇప్పటికే అనేక సమస్యలు పరిష్కారమై, ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం మరింత పెరిగిందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.