07-02-2026 12:43:45 AM
బోయినపల్లి: ఫిబ్రవరి6(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యులు నాగుల సాంబయ్య గౌడ్ ను తెలంగాణ రాష్ట్ర వార్డు సభ్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర వార్డు స భ్యుల సంక్షేమ సంఘం అధ్యక్షులు న్యాయవాది అ తికం రాజశేఖర్ గౌడ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకమైన నాగుల సాంబ య్య గౌడ్ మాట్లాడుతూ వార్డు సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని రాష్ట్రంలో ఉన్న వార్డు సభ్యుల సమస్యల పరిష్కారానికి నిరంతరం ముందుండి వారికి సేవకుడిలా ఉంటానని పేర్కొన్నారు.
తెలంగాణ వార్డు సభ్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నా నియామకానికి కృషి చేసిన రాష్ట్ర వార్డు సంక్షేమ సంఘం అధ్యక్షులు న్యాయవాది అతికం రాజశేఖర్ గౌడ్‌కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెస్రం నర్సయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. వార్డు సభ్యుల సంక్షేమ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని అన్ని జిల్లా లలో త్వరలో కమిటీలు వేస్తామని తెలిపారు.