07-02-2026 12:44:29 AM
గట్టు ,ఫిబ్రవరి 6: గ్రామాల్లోని అత్యంత నిరుపేద కుటుంబాలను గుర్తించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎస్‌ఎంపి రవీందర్ పేర్కొన్నారు.శుక్రవారం గట్టు మండల కేంద్రంలో నిర్వహించిన సమ్మేలిత ఉపాధి జీవనోపాధి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ... గ్రామాల్లోని పేదలను గుర్తించి, వారికి స్థానిక వనరులను బట్టి ఉ పాధి అవకాశాలు కల్పించడం ద్వారా రాబో యే రెండేళ్లలో వారిని సంపన్నులుగా మార్చడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశమని వివరించారు.
లబ్ధిదారులకు అవసరమైన శిక్షణ, ఆర్థిక తోడ్పాటు అందించి, వారు స్వ యం సమృద్ధి సాధించే వరకు సిబ్బంది అం డగా ఉండాలని సూచించారు. అనంతరం ఏపిడీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. మహి ళా సంఘాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఏంలు సలోమీ, అరుణ మండల అధ్యక్షు రాలు వేంకటేశ్వరి, ఇంచార్జీ ఏపీఎం దేవదాస్ ఈ కార్యక్రమ అమలు తీరును పర్యవే క్షించారు. కార్యక్రమంలో మండల సిబ్బంది, ఇతర సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.