8 May, 2026 | 1:05 AM

కేటీఆర్.. నీ నోరు ఫినాయిల్‌తో కడుక్కో

08-05-2026 12:00 AM

ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ 

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన నోరును ఫినాయిల్‌తో కడుక్కోవాలని ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శించారు. బీఆర్‌ఎస్ నాయకులను పాత చెప్పుతో కొట్టినా పాపం పోదన్నారు. గురువారం మెట్టు గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా కేటీఆర్ తన భాషను మార్చుకోవాలని.. లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

కేటీఆర్ ప్రభుత్వంపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ నేత లు రైతులను తీవ్రంగా గోస పెట్టారని, తెలంగాణ లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. పంజాబ్‌కి వెళ్లి అక్కడి రైతులకు చెక్కులు పంపిణీ చేయడం తెలంగాణ రైతు లను అవమానించడమేనని విమర్శించారు.

రైతు ల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతు కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. కేటీఆర్ తన చుట్టూ నలుగురు చిల్లరగాళ్లను, పదిమం ది భజన పరులను వేసుకొని తిరుగుతూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ ఇలాంటి విమర్శలు చేస్తున్నారని, ప్రజలు గమనిస్తున్నారని మెట్టు సాయికుమార్ హెచ్చరించారు.