6 July, 2026 | 9:16 PM

Breaking News

ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •   ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష   •  

నల్లగొండ టు యాదగిరిగుట్ట టెంపుల్ కారిడార్

14-05-2026 12:59 AM
  1. ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్ట్‌లను కలుపుతూ టూరిజం హబ్
  2. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ కార్పొరేషన్‌లకు ఓఆర్‌ఆర్‌లు
  3. మెగా గ్రోత్ కారిడార్‌పై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, మే 13 (విజయకాంత్): నల్లగొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్ ఏర్పాటు చేయాలని, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్‌లకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుచేయాలని, అందుకు అవసరమైన ఎస్టీపీలు డిజైన్ చేయాలని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. మున్సిపాలిటీల్లో సోలార్ ఎనర్జీ ప్లాంట్లు నిర్మించా లని, కృష్ణా నది పురష్కారాలకు అలంపూర్ జోగులాంబ జిల్లాలో ఏర్పాట్లు చేయాలన్నారు.

ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలి యన్‌లో మెగా గ్రోత్ కారిడార్‌పైన సీఎం బుధవారం సమీక్ష చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణంలో సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. ఖర్చు తగ్గించుకో వడానికి ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలలని, లీజ్‌కు తీసుకునే వాహనాలు కూడా ఈవీలే ఉండాలని స్పష్టం చేశారు. ప్రతిచోటా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అ య్యేలా చూడాలన్నారు.

అర్బన్ సెంట్రిక్ డె వలప్మెంట్ ప్లానింగ్ ఉండాలని, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్స్, వేస్ట్ వాటర్ ట్రీట్మెం ట్ ప్లాంట్‌లు, అర్బన్ ప్లానింగ్‌లో తప్పని సరిగా ఉండాలి అని సీఎం ఆదేశించారు. మున్సిపాలిటీలలో సోలార్ ఎనర్జీ ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్ ఎయిర్ పోర్ట్‌కు కావాల్సిన నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. సింగరేణి పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను ఒక యూనిట్‌గా చేయాలని, సింగరేణి సంస్థ సీఎస్‌ఆర్ నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలని పేర్కొన్నారు.

నల్గొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్‌ను, ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్ట్‌లను కలుపుతూ టూరిజం కారిడార్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అలంపూర్ -జోగులాంబ ఆలయాన్ని అభివృద్ధి చేయా లి. మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్లను కలిపి ఒకటి, కొత్తగూడం, పాల్వంచ, సుజాతనగర్ కలిపి మరొకటి కారిడార్‌ను ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడార్ భవిష్యత్ తెలంగాణకు చాలా కీలకమని సీఎం స్పష్టం చేశారు.