ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
14-05-2026 12:57 AM
కరీంనగర్ జిల్లా కలెక్టర్
జమ్మికుంట మే13 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. బుధవారం జమ్మికుంట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఒపీ, ఐపి తదితర రిజిస్టర్లను పరిశీలించి, ఆస్పత్రిలోని సౌకర్యాలు, వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ల్యాబ్, డ్రెస్సింగ్ రూమ్, మహిళా, పురుషుల వార్డులను పరిశీలించారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట తహసిల్దార్ వెంకటరెడ్డి, మెడికల్ ఆఫీసర్ సంపత్ రెడ్డి ఉన్నారు.






