బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నల్లబోతుల అరవింద్
వనపర్తి, మార్చి 5 (విజయక్రాంతి): బిజెపి యువ మోర్చా జిల్లా అధ్యక్షులుగా నల్ల బోతుల అరవింద్ ను నియమిస్తూ జి ల్లా అధ్యక్షుల నారాయణ నియామక పత్రా న్ని గురువారం జిల్లా కేంద్రం లోని బిజెపి జిల్లా కార్యాలయం లో అందచేశారు. జిల్లా వ్యాప్తంగా బిజెపి బలోపేతానికి తన వంతు బాధ్యతను నిర్వహిస్తానని పార్టీ ఏ కార్యక్రమం ఏ పిలుపునిచ్చిన సమర్థవంతంగా పూర్తి చేస్తానని యువ మోర్చా జిల్లా అధ్యక్షులు నల్లబోతుల అరవింద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అ య్యగారి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ స భ్యులు మున్నూరు రవీందర్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఆర్ పురుషోత్తం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీ నివాస్ గౌడ్ పెద్దిరాజు, జిల్లా కోశాధికారి కు మారస్వామి, కార్యాలయ కార్యదర్శి ఆగపోగు కుమార్, పార్లమెంట్ మాజీ ఫుల్ టై మర్ కేతూరి బుడ్డన్న, జిల్లా ఐటీ సెల్ కన్వీన ర్ అంజి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




