సౌతాఫ్రికాకు నమీబియా షాక్
ట్రై సిరీస్‌లో సంచలన విజయం
వరుసగా రెండోసారి గెలుపు
విండ్‌హోక్, ఆగస్టు 28: టీ ట్వంటీ క్రికెట్ లో పసికూన నమీబియా మరోసారి సంచలనం సృష్టించింది. టాప్ టీం దక్షిణాఫ్రికాపై సంచలన విజయం సాధించింది. ట్రై సిరీస్ లో భాగంగా విండ్‌హోక్‌లోని నమీబియా క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ఈ అద్భుత విజయం నమోదైంది.
మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. నమీబియా బ్యాటర్ జాన్ ఫ్రైలింక్ 38 బంతుల్లో 60 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆ డాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ప్రినెలన్ సుబ్రయెన్ 3 వికెట్లు తీయగా, డాన్ జాన్సెన్, జో ర్న్ ఫోర్టున్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా యువ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులకే పరిమితమైంది. సౌతాఫ్రికా బ్యాటర్ డెవాల్ బ్రెవిస్ (75 పరుగులు, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.
బౌలింగ్‌లో నమీబియా ఫాస్ట్ బౌలర్ రూబె న్ ట్రంపెల్మన్ (3/24) సఫారీ జట్టును గట్టి దెబ్బ తీశాడు. గత ఏడాది అక్టోబరులో జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో కూడా నమీబి యా 4 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను ఓడించింది. తాజా విజయంతో పురుషుల టి20 అంతర్జాతీయ క్రికెట్‌లో సౌతాఫ్రికాపై నమీబియా వరుసగా రెండో విజయాన్ని అందు కొని సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ చారిత్రాత్మక విజయం ద్వారా అంతర్జాతీయ క్రికె ట్‌లో అసోసియేట్ దేశమైన నమీబియా, బ లమైన సౌతాఫ్రికాపై తమ ఆధిపత్యాన్ని మ రోసారి నిరూపించుకుంది.






