11 May, 2026 | 3:05 PM

నమీబియాలో "బువ్వ"కు కరువు.. 83 ఏనుగులను చంపి.. మాంసం పంపిణీ కి నిర్ణయం

29-08-2024 12:49 PM

నమీబియా: మన దేశంలో అవ్వ కావాలా? బువ్వ కావాలా? అంటే.. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో ఏమున్నా.. లేకున్నా "బువ్వ"కు మాత్రం లోటు లేదు.. మరీ రోజూ "బగారా బువ్వ" కాక పోయినా కాస్త నాలుగు వేళ్లు నోట్లో కి వెళుతున్నాయంటే.. ఆహార భద్రతకు విధానపరంగా పెద్దపీట వేస్తున్న మన సర్కారుకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. కానీ జీ77 దేశాలు అధికంగా ఉన్న ఆఫ్రికా ఖండంలో పరిస్థితి దయనీయంగా ఉందంటున్నారు. నైరుతి ఆఫ్రికా దేశమైన నమీబియాలో  సగం జనాభా14,00000 మంది ప్రజలు కరువు తో అలమటిస్తు న్నారు. దీంతో  తాజాగా 700 అరుదైన అడవి జంతువులను వధించి ఆ మాంసాన్ని  ప్రజలందరికీ ఆహారంగా పంచాలని సర్కారు నిర్ణయించింది.  వీరు చెబుతున్న జాబితాలో 83 ఏనుగులు, 30 నీటి గుర్రాలు, 60 జడల బర్రెలు, 50 ఇంఫాలాలు, 10 బ్లూ వైల్డ్ బైసన్ బీస్ట్ లు, 300 జీబ్రాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ భారీ ప్రాణుల సంఖ్యను తగ్గిస్తే నీటి వనరులపై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాణులు నీటి కరువుతో తాగడానికి నీళ్లు దొరక్క భారీ సంఖ్యలో మరణించాయి. కాగా ఆఫ్రికా ఖండంలోని దక్షిణ ప్రాంతంలో ఏనుగుల సంఖ్య 200000కు పైగా ఉన్నాయి. అందుకే ఉభయ తారక మంత్రంగా అటు ప్రజలు.. ఇటు వన్య ప్రాణుల సమస్యను పరిష్కరించాలని నమీబియా సర్కారు మాంసం పంపిణీ కి నిర్ణయం తీసుకుందని అధికారులు వివరించారు.