11 May, 2026 | 4:21 PM

హైడ్రా కూల్చివేతలపై సీఎస్ శాంతి కుమారి సమావేశం

29-08-2024 12:23 PM

హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై సీఎస్ శాంతి కుమారి సమావేశం నిర్వహించారు. కూల్చివేతలపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం సమావేశం నిర్వహించారు. నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైకోర్టు హైడ్రాకు స్పష్టం చేసింది. హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖ సిబ్బందితో భేటీ అయ్యారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి కలెక్టర్లు పాల్గొన్నారు.