వాసుదేవుడిగా నరసింహుడు
29-04-2026 02:09 AM
- వైభవంగా నృసింహ జయంతి మహోత్సవాలు
- 30న గిరి ప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు: ఈవో
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 28(విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట దివ్య క్షేత్రంలో పంచనార సింహ స్వయంభు క్షేత్రంలో వార్షిక నృసింహ జయం తి మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అలంకారసేవ, యాగశాలలో ద్వారతోరణపూజ, మూర్తికుంభారాధన చతుఃస్థానార్చన, లక్ష్మీనృసింహ సుదర్శన, -గరుడమూలమంత్ర హోమాలు నిత్య పూర్ణా హుతి వేడుకలను ఆలయప్రధానార్చకులు, ఉపప్రధానార్చకులు నిర్వహించారు.
స్వామివారిని చూసిన భక్తులు భక్తి పారవష్యంలో మునిగితేలారు. ఈనెల 30వ తేదీన గిరిప్రదక్షిణానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో భవాని శంకర్ తెలిపారు. స్వామివారి నిత్య రాబడి 17,05,382 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.






