బేలలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు
17-08-2026 02:14 PM
బేల, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో నాగుల పంచమి వేడుకలను సోమ వారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, భక్తులు నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి పాలు, పూలు, పండ్లు సమర్పించారు. నాగదేవతకు అభిషేకాలు, ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి కుటుంబ సభ్యుల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.






