ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జనగణన స్వీయ నమోదు
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) ఏప్రిల్ 28 (విజయక్రాంతి): భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆన్లైన్ ద్వారా జనగణన కార్యక్రమంలో స్వీయ గణన నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
ప్రజలు స్వీయ గణన ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవడం వల్ల సమయం ఆదా అవుతుందన్నారు. సెల్ఫ్ ఎన్యూమ రేషన్ కొరకు https://se.census.gov.in లింక్ ఓపెన్ చేసి మొబైల్ నంబర్ నమోదు చేయాలని, ఓటిపి నమోదు చేసి జిల్లా, పట్టణం, గ్రామం, పిన్ కోడ్ నమోదు చేయాలని తెలిపారు. ఆన్లైన్ ద్వారా స్వీయ గనణలో ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
జిళ్లలో మే 10వ తేదీ వరకు స్వీయ గణన జరుగుతుందని తదుపరి మే 11వ తేదీ నుండి ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని, ఎన్యూమ రేటర్లుకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన సమయంలో వచ్చిన ఐడి నంబర్ తెలియచేయాలని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమ రేషన్ చేసిన ప్రతి ఒక్కరూ ఐడి నంబర్ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని తెలిపారు. జిల్లా ప్రజలు అందరూ జనగణన కార్యక్రమంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఓ జవహర్, డిప్యూటీ ఎస్‌ఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు.






