నరసింహపురం సర్పంచ్ ఎన్నిక రికౌంటింగ్ నిర్వహించాలి
రిటర్నింగ్ అధికారిపై తగు చర్యలు తీసుకోవాలి..
మోతె (విజయక్రాంతి): సర్పంచ్ ఎన్నికల్లో రీకౌంటింగ్ జరిపించాలి, రిటర్నింగ్ అధికారిపై తగు చర్యలు తీసుకోవాలని మోతె మండల ఎన్నికల అధికారి ఎంపీడీవోకి సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి వాంకుడోతు కమలమ్మ భర్త పొట్ట నరసింహపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలో పోటీ చేశారు. వారి గుర్తు కత్తెర గుర్తు పోస్టల్ బ్యాలెట్ లో వారికి రెండవ వరుస సంఖ్య ప్రకటించారు. వారి ప్రత్యర్థి అయిన వాంకుడోత్ బేబీ భర్త బోధ వారి గుర్తు బ్యాట్ గుర్తు వచ్చింది.
గ్రామంలో వారి ఇద్దరికి సమానంగా ఓట్లు (508) పోలైనవి అయితే దీనిపై తను రికార్డింగ్ అనుమతి కొరకై రిటర్నింగ్ అధికారికి పలు సార్లు చెప్పిన రీకౌంటింగ్ జరపలేదు. రీకౌంటింగ్ జరపకపోగా ఏకపక్షంగా అభ్యర్థి ప్రమేయం లేకుండానే రిటర్నింగ్ అధికారి తనంతట తనే డ్రా తీసి వాంకుడోత్ బేబీ పేరును గ్రామ సర్పంచ్ గా ప్రకటించారు. డ్రా తీసిన కాపిని కూడా ఎవరికి చూపించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. కావున దీనిపై తగిన విచారణ జరిపి రీకౌంటింగ్ జరిపించాలని మరియు రిటర్నింగ్ అధికారిపై తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరారు. వారి వెంట గెలుపొందిన వార్డు మెంబర్లు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.






