17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

గ్రామ ప్రజల మధ్య అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కరించాలి

15-12-2025 09:57 PM

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు..

నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): మండలంలోని గోలిలింగాల, పోచారం గ్రామ సర్పంచులు బుర్రకాయల రోజా, సంజీవరావులు, వార్డు మెంబర్లు సర్పంచ్గా గెలుపొందిన సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సర్పంచులకు, వార్డు మెంబర్లకు శాలువాలు కప్పి సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ... గ్రామ ప్రజల మధ్య నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. గోలిలింగాల, పోచారం గ్రామాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బుర్రకాయల రోజా, సంజీవరావు, వార్డ్ మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శివకుమార్, సురేందర్ గౌడ్ తదితరులు ఉన్నారు.