calender_icon.png 16 December, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది

15-12-2025 10:04:25 PM

రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కో-ఆర్డినేటర్ జీడీ వీరస్వామి..

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు జీడి ఎల్లయ్య భార్య జీడి నర్సమ్మ ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. విషయం తెలిసిన రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కో-ఆర్డినేటర్, తిమ్మాపురం గ్రామం మాజీ సర్పంచ్ జీడి వీరస్వామి సోమవారం మృతురాలి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి మృతురాలి కుటుంబానికి తనవంతు సహాయంగా రూ.5వేల ఆర్థిక సహాయం అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు. నివాళులర్పించిన వారిలో కాంగ్రెస్, సీపీఎం నాయకులు గుడిపల్లి వెంకట్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బుడిగె వెంకన్న, ఎల్లెంల అవిలయ్య, కుంచం చిన్న రాములు, మారం కోటిరెడ్డి, బింగి బాలరాజు, జీడి భాస్కర్, సైదులు, రవీందర్, వెంకన్న, సుధీర్, పసుపులేటి వీరారెడ్డి, బొడ్డు శ్రీనుయాదవ్, సిద్ధి రాము తదితరులు ఉన్నారు.