7 April, 2026 | 9:31 PM

నారాయణ విద్యాసంస్థల (మమత రోడ్) గ్రాడ్యుయేషన్ డే

07-04-2026 08:00 PM

ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ కూరపాటి ప్రదీప్

ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం మమత రోడ్డులోని నారాయణ స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి నారాయణ విద్యాసంస్థల ఏజీఎం రామ్కీ మార్గదర్శకత్వంలో కార్యక్రమాన్ని అద్భుతంగా నడిపించారు. ఈ వేడుకలకు ప్రముఖ పీడియాట్రీషియన్ (బాలల వైద్య నిపుణులు) డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. విద్యార్థులను కేవలం ర్యాంకుల కోసం కాకుండా, కులమతాలకు అతీతంగా ఉన్నతమైన విలువలు కలిగిన ఉత్తమ భారతీయులుగా తీర్చిదిద్దాలని కోరారు. సమాజం పట్ల బాధ్యత , దేశం పట్ల గౌరవం ఉన్న పౌరులుగా పిల్లలను పెంచడం తల్లిదండ్రుల ప్రథమ కర్తవ్యమని ఆయన ఉద్ఘాటించారు. వేదికపై చిన్నారులతో కలిసి ఉత్సాహంగా నృత్యం (డ్యాన్స్) చేయడం విశేషం.

ఆయన సరదాగా పిల్లలతో మమేకమవ్వడం అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకుంది. ఏజీఎం రామ్కీ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలో ప్రిన్సిపాల్, కోఆర్డినేటర్లు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా సర్టిఫికేట్లను అందజేసి, వారిని అభినందించారు. రామ్కీ గైడ్‌లైన్స్‌లో నిర్వహించబడిన ఈ కార్యక్రమం అత్యంత విజయవంతమైందని, విద్యార్థులకు ఇది ఒక మధుర జ్ఞాపకమని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.