20-12-2025 12:00:00 AM
దేశం తరఫున ఎంపికైన వారిలో సగానికి పైగా ఆ విద్యా సంస్థ విద్యార్థులే
మొత్తం 13 పతకాలతో అద్బుత విజయం
హైదరాబాద్, డిసెంబర్ 19(విజయక్రాంతి): 2025 అంతర్జాతీయ సైన్స్ ఒలిం పియాడ్స్‌లో నారాయణ విద్యాసంస్థలు తమ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. వివిధ విభాగాల్లో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన 27 మంది విద్యార్థులలో 13 మంది నారాయణ విద్యా సంస్థల కు చెందినవారే కావడం విశేషం. కేవలం నారాయణ విద్యార్థులే దేశానికి 7 స్వర్ణ, 6 రజత పతకాలను సాధించి చరిత్ర సృష్టించారు.
జూనియర్ సైన్స్, ఆస్ట్రానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి ఆరు ప్రధాన అంతర్జాతీయ పోటీల్లో నారాయణ విద్యార్థులు అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ సింధూర నారాయణ విద్యార్థుల ను ప్రత్యేకంగా అభినందించారు. ‘సరైన మార్గదర్శకత్వం, పట్టుదల ఉంటే విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతాలు సృష్టించగలరని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
మరో డైరెక్టర్ శరణి నారాయణ మాట్లాడుతూ‘నారాయణ విద్యార్థుల విజయం వెనుక వారి ఏళ్ల తరబడి కృషి, క్రమశిక్షణతో పాటు మా అధ్యా పకుల నిరంతర తోడ్పాటు ఉంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దే నారాయణ విద్యా విధానానికి ఈ పతకాలే నిదర్శనం’ అని పేర్కొన్నారు.