20-12-2025 12:00:00 AM
కరకట్ట నిర్మాణంతో వరద ముంపు నివారణ
పంచాయతీరాజ్ &గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.
ఏటూరునాగారం,డిసెంబర్19(విజయక్రాంతి): ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చ డమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యం అని, భూ టారం గ్రామ సమీపంలోని జంపన్న వాగు కరకట్ట నిర్మాణంతో వరద ముంపు నుంచి నివారణ లభిస్తుందని పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మ హిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.శుక్రవారం ఏటూరునాగారం మండలం భూటా రం గ్రామంలో మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణిలతో కలిసి నీటిపారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 50 0 మీటర్ల పొడవు తో 195.00 లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న జంపన్న వాగు కరకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటను హామీలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యం అని , భూటారం గ్రామానికి సమీప జంపన్న వాగు నుంచి తరచూ వరద ముంపు ఉండేదని గ్రామ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 1 కోటి 95 లక్షల రూపాయల నిధులతో 500 మీటర్ల పొడవుతో కరకట్ట నిర్మాణం చేయడం జరుగుతుందని అన్నారు.
కరకట్ట నిర్మాణంతో గ్రామానికి వరద ముంపు నుంచి విముక్తి కలుగుతుందని, నాణ్యత ప్రమాణాలను అత్యంత ప టిష్టంగా కరకట్ట నిర్మాణం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.గ్రామ ప్రజలు , యువకులు సలహాలు సూచనలు అందిస్తూ గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని సూచించారు. మంగపేట మండ లంలో 100 కోట్ల రూపాయల నిధులతో నూతన టెక్నాలజీ ఉపయోగించి కరకట్ట నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపా రు.గ్రామాలను అభివృద్ధి చేయాలనే ముఖ్య లక్ష్యంతో ప్రభుత్వం అనేక పథకాలను అవలంబిస్తుందని స్థానికంగా ఏమైనా సమస్య లు తలెత్తితే వెంటనే యువకులు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.