20-12-2025 12:00:00 AM
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక వ్యాపారం
కేసముద్రం, డిసెంబర్ 19 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణం పేరుతో ఇసుక అక్రమ రవాణా దండ జోరుగా సాగుతున్నట్లు విమర్శలు వస్తున్నా యి. ఇసుక దందాకు కొందరు కూటమి కట్టి మండల సరిహద్దుల్లోని వాగుల నుండి ఇసు క అక్రమ రవాణా చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తూ అడ్డు అదుపు లేకుండా రెండు చే తుల సంపాదిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కొందరు ఇసుక ట్రాక్టర్ల యజమా నులతో పాటు రాజకీయ పార్టీల నేతల హ స్తం ఇసుక దందాలో ఉన్నట్లు ప్రచారం సా గుతోంది. దీనితో ఇసుక అక్రమ రవాణా దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింద నే విమర్శలు వస్తున్నాయి.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఇచ్చిన కూపన్లను సైతం ప ట్టించుకోకుండా ట్రిప్పుకు 4000 నుండి 6000 రూపాయల వరకు అధిక ధరలకు ఇసుక విక్రయిస్తూ దోచుకుంటున్నట్లు విమ ర్శ వస్తున్నాయి. నిరుపేదలకు ఇండ్ల నిర్మాణానికి ఇందిరమ్మ పథకంలో మంజూరు చే సిన ఇసుక కూపన్లను సైతం పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద తలల జోక్యంతో ఇసుక రవాణా సాగుతుండడంతో అధికారులు సైతం చూసి చూ డనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వె ల్లువెత్తుతున్నాయి. గతంలో ప్రభుత్వ అనుమతి పొందిన ఇసుక రీచ్ నుంచి ఇసుక ర వాణా చేయడానికి పర్మిట్లు ఇస్తుండగా ఇ ప్పుడు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో స్థానిక వాగుల నుండి ఎడాపెడా ఇసుక రవాణా చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
నంబర్ లేని ట్రాక్టర్లలో ఇసుక రవాణా అక్రమానికి ఇదే నిదర్శనం
రోడ్డుపై తిరిగే ప్రతి వాహనానికి కచ్చితం గా నంబర్ ప్లేట్ ఉండాల్సి ఉంటుంది. అయి తే ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లకు మాత్రం నంబర్లు లేకుండా నడపడం ఇసుక అక్రమ రవాణాకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రధాన రహదారులపై అంతులేని వేగంతో నంబర్ ప్లేట్లు లేని ట్రాక్టర్లతో ఇసుక రవాణా ‘జోరు’గా సాగుతోంది. నంబర్ ప్లేట్లు లేకుండా ఇసుక ట్రాక్టర్లు జోరుగా ప్రధాన రహదారిపై పరుగులు పెడుతున్నా అటు పోలీసులు, ఇటు రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. అనుమతి పొంది ఉంటే నంబర్ ప్లే ట్లు లేని ట్రాక్టర్లను ఇసుక రవాణాకు ఎందు కు వినియోగిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ట్రాక్టర్లను ఇసుక అక్రమ రవాణా చేసేవారు పట్టుకోకుండా ఉండేందుకే నంబ ర్ ప్లేట్లు తొలగించి ఇసుక రవాణా చేస్తున్న ట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం పేద ల గృహ నిర్మాణం కోసం రాయితీతో కూ డిన ఇసుక రవాణాకు జారీ చేసిన కూపన్లు పక్కదారి పట్టిస్తున్నట్లు కూడా విమర్శలు వ స్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పం దించి ఇసుక అక్రమ రవాణా దందాకు అడ్డుకట్ట వేసి, పేదల నిర్మించుకుంటున్న ఇండ్ల నిర్మాణానికి తక్కువ ధరకు ఇసుక సరఫరా చేయాలని కోరుతున్నారు.