8 May, 2026 | 2:22 AM

పబ్‌లపై నార్కోటిక్స్ బ్యూరో దాడులు

31-08-2024 04:04 PM

హైదరాబాద్: రంగారెడ్డి, హైదరాబాద్, జిల్లాల పరిధిలోని 25 పబ్బుల్లో నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. డ్రగ్ డిటెక్షన్ కిట్‌లు వాడుతున్న 107 మందిని అధికారులు పరీక్షించగా, ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. శనివారం ఉదయం 11 గంటలకు మళ్లీ ప్రారంభమైన సోదాలు మధ్యాహ్నం 1 గంటల వరకు కొనసాగాయి. నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు తనిఖీల్లో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.