3 June, 2026 | 2:03 AM

మరిపెడ మున్సిపల్ కమిషనర్‌గా నరేష్ రెడ్డి

02-06-2026 01:35 AM

మరిపెడ (మహబూబాబాద్) జూన్ 1 (విజయక్రాంతి): మరిపెడ మున్సిపాలిటీ నూత న కమిషనర్గా కంచర్ల నరేష్ రెడ్డి సోమవా రం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ కమిషనర్గా విధులు నిర్వహించిన రామడుగు విజ యనంద్ పదోన్నతిపై భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో అసిస్టెంట్ కమిషనర్గా బదిలీ కావడంతో, భువనగిరి మున్సి పాలిటీలో కమిషనర్ గా పనిచేస్తున్న నరేష్ రెడ్డిని మరిపెడ మున్సిపల్ కమిషనర్గా నియమించారు.

ఈ సందర్భంగా మరిపెడ మున్సి పల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కమిషనర్ రామడుగు విజయనంద్కు ఘన వీడ్కోలు పలికారు. మరిపెడ మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో విజయనంద్ అందించిన సే వలను పలువురు కొనియాడారు. అదేవిధం గా నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన నరేష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. విజయనంద్, నరేష్ రెడ్డిలను శాలువాలతో సత్కరించి ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి, కౌన్సిలర్లు రాము, జాటోత్ సురేష్ నాయక్, పానుగోతు రాములు, సుజాత మహిపాల్ రెడ్డి , బోడ భాస్కర్, గౌతంరెడ్డి, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.