కలెక్టర్‌ను కలిసిన జీడబ్ల్యూఎంసీ అడిషనల్ కమిషనర్
02-06-2026 01:38 AM
హన్మకొండ, జూన్ 1 (విజయక్రాంతి): ఇటీవల జరిగిన బదిలీల్లో హన్మకొండ మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేస్తూ జీడబ్ల్యూఎంసీ అడిషనల్ కమిషనర్గా బదిలీ అయిన ఇసంపెల్లి జోనా సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్పాయ్ను కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇసంపెల్లి జోనాకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేసి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. నగరాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవతో పనిచేయాలని ఆకాంక్షించారు.






