2 June, 2026 | 2:24 AM

సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

02-06-2026 01:34 AM

కలెక్టర్ స్నేహ శబరీష్

మహబూబాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్లు అనిల్ కుమార్, పురుషోత్తం పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ స్నేహ శబరీష్ స్వయంగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను ఓపికగా విని, తక్షణ పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని, పెండిం గ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, పారదర్శకమైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

నేడు నిర్వహించనున్న తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, వచ్చిన అతిథులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున మంచినీటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించా రు. ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా భూ సమస్యలు, పింఛన్లు, డబుల్ బెడ్ రూ మ్ ఇళ్లు, రేషన్ కార్డులు, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన 142 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిసిఓ వెంకటేశ్వర్లు, అన్ని విభాగాల అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమా ర్, డివిజన్ కార్యాలయాలలో డివిజన్ స్థా యి అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.