అక్రమార్కుల చెరలో నస్పూర్ ఊర చెరువు
మంచిర్యాల, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ఊర చెరువు నాయకుల, అధికారుల అండదండలతో అక్రమార్కులు అడ్డగోలుగా ఆక్రమించుకుంటున్నారు. ఎఫ్‌టీఎల్ లెవల్ దాటి మట్టిని రోజుకు కొంతమేర నింపుతూ దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతుందని, ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, అటు ఇరిగేషన్, ఇటు రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.
చెరువును ఆక్రమించి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తుంటే నాయకులు, అధికారులు మిన్నకుండి, వారికి సహకరిస్తున్నారని ఇప్పటికైనా అధికారులు కండ్లు తెరిచి చూడాలని, చెరువు ఆక్రమణను ఆపాలని మత్య్సకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం నస్పూర్ ప్లడ్ కాలనీ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నాయకులు నస్పూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి చెరువును రక్షించాలని వేడుకున్నారు. అధికారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.






