21 July, 2026 | 7:11 PM

Breaking News

అమ్మ నగర్ బ్రిడ్జితో దూరభారం తగ్గుతుంది   •   నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలి   •   జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం   •   సీజనల్ వ్యాధులు ప్రబలకుండా విస్తృత అవగాహన   •   సుల్తానాబాద్ మున్సిపాలిటీ 17 బూతుల బిఎల్ఎ 2 ల సమావేశం   •   ఫోటో, వీడియో గ్రాఫర్ల కు అండగా ఉంటాం: మేయర్ కొలగాని   •   ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో వేగం పెంచాలి   •   సర్పంచ్ పగడాల రమాదేవి అధ్వర్యంలో తడి–పొడి చెత్త బుట్టల పంపిణీ   •   ఇల్లందు–బొమ్మనపల్లి ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత   •   సులానగర్ పీహెచ్‌సీలో బదిలీ ఉద్యోగులకు ఘన వీడ్కోలు   •  

బుమ్రా వికెట్ల వేట.. ఆసీస్ తొలి వికెట్ డౌన్.. 18/1

22-11-2024 01:32 PM

బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచులో టీమిండియా కెప్టెన్ వికెట్ల వేట మొదలు పెట్టాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ(10)ని బుమ్రా ఎల్‌బీడబ్ల్యూ చేశాడు. ముందు అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో భారత్ డీఆర్ఎస్ తీసుకుంది. సమీక్షలో ఔట్ అని తేలడంతో టీమిండియా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. అనంతరం క్రీజులోకి వచ్చిన లుబుషేన్ ను ఔట్ చేసే అవకాశం మిస్ అయింది. బుమ్రా వేసిన బంతిని ఆడబోయిన లుబుషేన్ స్లిప్ లో విరాట్ కు క్యాచ్ ఇచ్చాడు. పట్టుకున్నట్లు అనిపించినా చివరి క్షణంలో విరాట్ క్యాచ్ చేజార్చాడు దీంతో అందరూ ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది.