24 May, 2026 | 3:24 AM

సింగరేణికి జాతీయ స్థాయి అవార్డు

18-06-2024 12:05 AM

మంచిర్యాల, జూన్ 17 (విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఉద్యోగుల సమాచారానికి, సేవలకు ఇన్‌ఫార్మేషన్ టెక్నాలజీని విస్తృతంగా వాడుతున్నందుకు గుర్తింపుగా కంప్యూటర్ ఎక్స్‌ప్రెస్ సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఐటీ సేవల కంపెనీగా సింగరేణికి అవార్డును అందజేసింది. ఆదివారం రాత్రి జైపూర్‌లో జరిగిన జాతీయ స్థాయి సమావేశంలో అవార్డును సింగరేణి సంస్థకు అందజేశారు. ఈ పురస్కారాన్ని సోమవారం సింగరేణి భవన్‌లో సీఎండీ బలరాంనాయక్‌కు జీఎం(కో ఆర్డినేషన్) దేవేందర్, ప్రాజెక్టు మేనేజర్(ఐటీ) హరప్రసాద్, ఐటీ డిప్యూటీ జనరల్ మేనేజర్లు హరిశంకర్, హరిప్రసాద్, మేనేజర్ రామలక్ష్యయ్య అందజేశారు. సింగరేణి సంస్థకు ఎంటర్‌ప్రైజెస్ అప్లికేషన్ కేటగిరీలో ఈ అవార్డు లభించింది.