గొప్ప మనుసు చాటుకున్న కండక్టర్
18-06-2024 12:05 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్17(విజయక్రాంతి): ఆర్టీసీ కండక్టర్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో మంచిర్యాల జిల్లా శాంతినగర్ కాలనీకి చెందిన సాంబమూర్తి, లక్ష్మి దంపతులు మందమర్రి వద్ద బస్సు ఎక్కి బూరుగూడ స్టేజి వద్ద దిగారు. ఈ క్రమంలో లక్ష్మి తన తనమెడలోని పుస్తెలతాడు బస్సులో పడిపోయింది. గమనించిన కండెక్టర్ ఆశన్న డిపో అధికారులకు అప్పగించారు. ఇంతలోనే సాంబమూర్తి, లక్ష్మి బస్సులో పడిపోయి ఉంటుందని డిపో వద్దకు వచ్చి అధికారులను కలిశారు. అధికారులు వారికి పుస్తెలతాడును అప్పగించారు. కండక్టర్ ఆశన్నను డీఎం విశ్వ నాథ్ అభినంధించారు.






