24 May, 2026 | 4:24 AM

దవాఖానకు వచ్చేవారు ఆరోగ్యంతో వెళ్లాలి

18-06-2024 12:05 AM
  • డీఎంహెచ్‌వోకు ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి సూచన

జగిత్యాల, జూన్ 17(విజయక్రాంతి): అనారోగ్యంతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన రోగులు ఆరోగ్యంతో తిరిగి వెళ్లేలా సేవలు అందించాలని డీఎంహెచ్‌వోతో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్య అధికారి  సమియొద్దీన్ సోమవారం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జగిత్యాల జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంతసురేష్‌లను వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ వరాకాలం సీజనల్ వ్యాధుల ప్రబలే అవకాశాలు ఉన్న దృష్ట్యా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లేగా మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.