25-05-2025 08:57:30 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీ ఫిల్లింగ్ స్టేషన్ యజమాని ఆడెపు సూర్యం-సంధ్యారాణి దంపతుల కుమారుడు ఆడెపు ధీరజ్ జాతీయస్థాయి గ్రేట్ పీపుల్ మేనేజర్స్ అవార్డు(National Level Great People Managers Award) ముంబైలో అందుకున్నారు. భారతదేశ వ్యాప్తంగా టాప్ 100 గ్రేట్ పీపుల్ మేనేజర్స్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేయగా అందులో నుండి హుజురాబాద్ కు చెందిన ఆడెపు ధీరజ్ ఎంపిక కాగా ముంబాయిలో నిర్వహించిన జిఎంఐ సమ్మిట్ లో గ్రేట్ మేనేజర్ ఇన్స్టిట్యూట్ ఇన్ గ్రేట్ మేనేజర్స్ లీగ్ సమ్మేటివ్ 2025 ఇన్ టాటా థియేటర్ ఎన్సిపిఏ లో అవార్డును, సర్టిఫికెట్ ను అందజేశారు. దేశంలోనే వందమంది వ్యాపారవేత్తలలో హుజురాబాద్ కు చెందిన ధీరజ్ ఎంపిక కావడం జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అని పలువురు కొనియాడారు. మిత్రులు, శ్రేయోభిలాషులు, వ్యాపారులు ధీరజ్ కి అభినందనలు తెలిపారు.