calender_icon.png 26 May, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ వైర్ తగిలి వ్యక్తి మృతి

25-05-2025 08:51:14 PM

చిన్నచింతకుంట: విద్యుత్‌ తీగ ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని చిన్న వడ్డెమాన్ గ్రామం(Vaddeman Village)లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... చిన్న వడ్డెమాన్  గ్రామానికి చెందిన బోయ భీమన్న(50) ఇంటి అవసరాల కోసం పొయ్యిల కట్టెలు ఏరుకోవడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి అక్కడక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని  భార్య చిట్టెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రామ్ లాల్ తెలిపారు.