6 July, 2026 | 9:22 PM

Breaking News

ముమ్మరంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమం   •   మల్లెలమడుగు గ్రామ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేకు సీపీఎం వినతిపత్రం   •   బీజేపీ జిల్లా ఎండోమెంట్ సెల్ కన్వీనర్‌గా పసునూరి తిరుపతి   •   ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •  

జాతీయస్థాయి మహిళా బాక్సింగ్ పోటీలు

30-06-2025 02:16 AM

సరూర్ నగర్ స్టేడియంలో ఎలైట్ ఉమెన్స్ నేషనల్ లెవేల్ బాక్సింగ్ టోర్నమెంట్

ఎల్బీనగర్, జూన్ 29 : ఎలైట్ ఉమేన్స్ నేషనల్ లేవేల్ బాక్సింగ్ టోర్నమెంట్ 2025 పోటీలు ఆదివారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. పోటీలకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాతీయ పోటీల్లో అగ్రశ్రేణికి చెందిన 12 మంది బాక్సర్స్ పాల్గొనడం స్ఫూర్తినీయమన్నారు. ఒలింపిక్స్ మెడలిస్టులు, వరల్ ఛాంపియన్స్ పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు.

కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు స్టేట్ సెక్రటరీ రవీందర్, అధ్యక్షులు మన్మోహన్, సరూర్ నగర్ స్టేడియం కోచ్ కుమార్, నిజాం కాలేజ్ గ్రౌండ్ బాక్సింగ్ కోచ్ దుర్గా ప్రసాద్, బీఆర్‌ఎస్ నాయకులు అధ్యక్షులు రవిముదిరాజ్, సొంటి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

- రక్తదానం ప్రాణదానంతో సమానం మాన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని శ్రీరాంహిల్స్ కాలనీ కమ్యూనిటి హాల్ భీమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. రక్తదానం చేస్తున్నవారిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, శ్రీరాంహిల్స్ కాలనీ సంఘం అధ్యక్ష, కార్యవర్గ సభ్యులుపాల్గొన్నారు.