4 March, 2026 | 5:49 PM

బెజ్జూర్‌లో నేషనల్ లైన్ మెన్ డే

04-03-2026 04:32 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): లైన్ మెన్ల సేవలు అభినందనీయమని ఏఈ అంజల్ కుమార్ అన్నారు. బెజ్జూర్ మండల కేంద్రంలోని సెక్షన్ పరిధిలో, వారి కష్టాన్ని గుర్తించడానికి ప్రతి ఏటా మార్చి 4న "నేషనల్ లైన్‌మెన్ డే" నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇళ్లకు నిరంతరం విద్యుత్ సరఫరా అందేలా చూస్తూ, ప్రాణాలకు తెగించి పనిచేసే లైన్‌మెన్ల పట్ల కృతజ్ఞత తెలపడమే ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు.​ విద్యుత్ వ్యవస్థలో లైన్‌మెన్లు క్షేత్రస్థాయిలో పనిచేసే నిజమైన వీరులు అని వారి సేవలను కొనియాఆడారు.​ ప్రమాదకరమైన పని విద్యుత్ తీగలతో పనిచేయడం ఎంతో ప్రమాదకరమైనది. వర్షం, ఎండ, చలి అని చూడకుండా వారు స్తంభాలు ఎక్కి రిపేర్లు చేస్తారు.

అత్యవసర సేవలు: తుపాన్లు లేదా భారీ వర్షాల వల్ల విద్యుత్ లైన్లు తెగిపోయినప్పుడు, యుద్ధ ప్రాతిపదికన వాటిని పునరుద్ధరించేది వారే నని అన్నారు. విద్యుత్ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన లైన్‌మెన్లకు ప్రశంసా పత్రాలు అందజేసి సాల్వాతో  ఘనంగా సత్కరించినట్లు తెలిపారు. ప్రజల సౌకర్యం కోసం ప్రాణాలను పణంగా పెట్టే వారి పట్ల గౌరవంగా ఉండటం, విద్యుత్‌ను వృథా చేయకుండా ఉండటమే మనం వారికి ఇచ్చే నిజమైన కృతజ్ఞత అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లైన్ఇన్స్పెక్టర్ ధర్మయ్య, లైన్మెన్లు బాలాజీ, అశోక్, చరణ్ దాస్,మల్లేష్, ఆపరేటర్లు సంతోష్, శ్రీనివాస్ సిబ్బంది రాకేష్,రమేష్,పాల్గొన్నారు.