4 March, 2026 | 5:41 PM

జన్మదిన సందర్భంగా సర్పంచ్ నీ సన్మానించిన మాజీ జడ్పిటిసి

04-03-2026 04:34 PM

దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ సర్పంచ్ ఐరేని నర్సయ్య జన్మదినం సందర్భంగా బుధవారం దోమకొండ మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల్ గౌడ్ సన్మానించారు. దోమకొండ మండల కాంగ్రెస్ కార్యాలయంలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా నాయకులు తాటిపల్లి శ్రీకాంత్, పట్టణ అధ్యక్షులు సీతారాం మధు, సంజీవరెడ్డి, అంకం బాలరాజ్, కమ్మరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.