29 August, 2026 | 8:38 PM

Breaking News

సర్కార్ స్థలాలు కాపాడండి   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం ప్రజా పాలనకు పెద్దపీట ఎమ్మెల్యే జారె   •   ఉద్యమకారుల సంక్షేమ సంఘం నకిరేకల్ అధ్యక్షుడిగా ఉయ్యాల ప్రశాంత్ గౌడ్   •   వెయ్యి రోజుల పాలనలో రేవంత్ సర్కార్ అట్టర్‌ఫ్లాప్   •   1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట   •   షాలేము బహుజన దమ్మపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె   •   నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యం: మేయర్ కొలగాని శ్రీనివాస్   •   కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనలో వరుస నిరసనలే...   •   ఘనంగా జాతీయ క్రీడ, తెలుగు భాషా దినోత్సవ వేడుకలు   •   జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు పాదయాత్ర   •  

గురుకుల డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా, తెలుగు భాషా దినోత్సవాలు

29-08-2026 06:54 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధి, అంకుషాపూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మహేంద్ర హిల్స్‌లో జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి తెలుగు భాష గొప్పతనాన్ని చాటారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ  విద్యార్థినులు క్రీడలపై ఆసక్తి పెంచుకొని, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అన్నారు.

భారత క్రీడా రంగానికి మేజర్ ధ్యాన్ చంద్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. తెలుగు భాష ప్రపంచంలోనే గొప్ప భాషల్లో ఒకటని, తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. మాతృభాషపై అభిమానం పెంపొందించుకొని, తెలుగు భాషను భావితరాలకు అందించాలని విద్యార్థినులకు సూచించారు. అనంతరం రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ లో పతకాలు సాధించిన తేజశ్రీ, సౌమ్యలను అభినందిస్తూ మెడల్స్ వేసి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, క్రీడా విభాగం, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.