29 August, 2026 | 7:58 PM

1973-74 విద్యార్థుల ఆత్మీయ కలయిక

29-08-2026 06:55 PM


సుల్తానాబాద్ ఆగస్టు 29 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 1973-74 బ్యాచ్ విద్యార్థులు, తమ విద్యా ప్రయాణం మొదలై 52 ఏళ్లు 2026 వరకు పూర్తయిన సందర్భంగా ఆదివారం  ఒక ఆత్మీయ కలయిక (రీయూనియన్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కార్యక్రమానిర్వాకులు, మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్ శనివారం తెలిపారు, ప్రస్తుతం 68 ఏళ్ల వయసులో ఉన్న ఈ ఎస్.ఎస్.సి  బ్యాచ్ విద్యార్థులందరూ ఈ వేడుకను జరుపుకోనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమం The Soil Remembers Every Thing ( నేల ప్రతి విషయాన్నీగుర్తుంచుకుంటుంది.)  కూడా ఏర్పాటుచేయ బడింది.అంతే కాకుండా మా కెరీర్‌ను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను మేము ఈ సందర్భంగా  పెద్దపల్లి రోడ్డులోని 'శ్రీ సాయిరాం ఫంక్షన్ హాల్'లో సన్మానించుకోవడం జరుగుతుందన్నారు,  ఈ కార్యక్రమానికి 1973-74 బ్యాచ్ విద్యార్థులందరూ తప్పక హాజరుకావాలని కోరుతున్నాము. ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే  చింతకుంట విజయ రమణారావు  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని తెలిపారు, అయిల రమేష్ వెంట పలువురు క్లాస్ మెంట్స్ ఉన్నారు.