calender_icon.png 11 November, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్

11-11-2025 06:54:02 PM

హైదరాబాద్: తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్(Jubilee Hills by-election) కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంతంగా ముగిసింది. భారత ఎన్నికల సంఘం (ECI) ప్రకారం... జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు 47.16% శాతం(Jubilee Hills by-election polling percentage) పోలింగ్ పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.  4.01 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోని, బరిలో ఉన్న 58 మంది అభ్యర్థుల అదృష్టాన్ని నిర్ణయించనున్నారు. కాగా, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ బూత్‌ల వద్ద క్యూలో ఉన్నవారికి ఓటు వేయడానికి అధికారులు అనుమతించారు.

ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం, మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు 31.94 శాతం, సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం ఓట్లు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 4.01 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోని, బరిలో ఉన్న 58 మంది అభ్యర్థుల అదృష్టాన్ని నిర్ణయించనున్నారు. జూబ్లీహిల్స్ లో అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున మాగంటి గోపినాథ్ భార్య సునీత, కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదమ్, భారతీయ జనతా పార్టీ తరుపున లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈనెల 14న  జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగనుంది.