శాఖలపై అవగాహన అవసరం
- త్వరలో అందరి పని తీరుపైనా మాట్లాడుతా
- పారిశ్రామికీకరణలో తెలంగాణ ఆదర్శంగా ఉండాలి
- ప్రణాళికాబద్ధంగా జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్‌లుగా విభజించాం
- కార్యాలయాలు అద్దెభవనాల్లో ఉండకూడదు
- ప్రతి సెక్రటరీ తమ శాఖల్లో బెస్ట్ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసుకోవాలి
- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులంతా పాల్గొనాల్సిందే
- ప్రభుత్వ కార్యదర్శుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి) : శాఖలపై అధికారులకు సంపూర్ణ అవగాహన ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగు లు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జాబితా సి ద్ధం చేయాలని ఆదేశించారు. మార్చి 4తేదీన జరిగే కలెక్టర్ల సమావేశంలో అందరి పనితీరుపైనా మాట్లాడుతానని అన్నారు. పారిశ్రామికీ కరణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉం డాలని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
శనివారం సచివాలయం లో నిర్వహించిన ప్రభుత్వ కార్యదర్శుల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రో జుల కార్యాచరణ ఉంటుందని, ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక లోగో తయారు చేస్తు న్నామని తెలిపారు. ప్రణాళికా బద్ధంగా జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్‌లుగా విభజిం చామని, కోర్ అర్బన్ రీజియన్‌లో చేపట్టాల్సిన కార్యాచరణపైనా అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. ప్యూర్ అర్బన్ రీజియన్ 10 వేల చదరపు కిలో మీటర్ల పరిధిలో విస్తరించి ఉందని, ఇక్కడ మాన్యుఫాక్చరింగ్ రంగం విస్తరించాలన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీలు లేదని, ప్రతి శాఖకు సొంత భవనం ఉండాలని, బడ్జెట్ ప్రతిపాదనలో వీటిని చేర్చాలని ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలపైనా ప్రతి శాఖ దృష్టి పెట్టాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫైల్ విధానం ఉండాలని, నిర్ణీత సమయంలో ఫైల్ క్లియర్ కావాల్సిందే అని ఆదేశించారు. వివిధ కంపెనీలతో చేసుకు న్న ఒప్పందాలు, పెట్టుబడులు గ్రౌండ్ కావాలని, పాత కాలం సర్వర్‌లను అప్డేట్ చేసు కోవాలని సూచించారు.
పకడ్బందీగా సంక్షేమ పథకాలు
సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని, ఇందులో సాంకేతికత ను వినియోగించుకోవాలని సూచించారు. నిజమైన లబ్ధి దారులకు సంక్షేమ పథకాలు అందాలని చె ప్పారు. 30వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ పైన దృష్టి పెట్టాలని, ఫ్యూచర్ సిటీ దేశ ఆర్థ్ధిక స్థితిని మార్చబోతోందన్నారు. మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నా మని, ఇక్కడ వచ్చే మార్పుల ను ప్రజలకు వివరించాలని చెప్పారు. డిజిటల్ గవర్నెన్స్, నాణ్యమై న విద్యను అం దించడంపై దృష్టి సారించాలన్నారు.
వంద నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారం భించుకోబోతున్నామని, ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడాలని, ప్రాం తాల వారీగా మెడికల్ డేటా తయారు చేయాలని సూచించారు. ప్రతి సెక్రటరీ తమ శాఖల్లో బెస్ట్ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసుకోవాలన్నారు. మార్చి 6 నుంచి 99 రోజుల ప్రణాళిక జూన్ 12 వరకు జరగబోతుందని, జూన్ 2 వరకు ప్రతి ఆఫీస్ పరిశుభ్రంగా కావాల్సిందే అని ఆదేశించారు.
జూన్ 2 తెలంగాణకు పండుగ అని అంతా ఘనంగా జరుపుకోవాలని సూ చించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమమని ప్రతి అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి.. మినహాయింపులు ఉండవని హెచ్చరించారు. ప్రతి ఎన్నికలో ప్రజలు నాకు కావాల్సిన బలాన్ని ఇచ్చారని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మనం ప్రజలకు మంచి చేయాలని ఆదేశించారు.




