మహా జాతర విజయవంతం
- మంత్రి పొంగులేటి
- మేడారం అభివృద్ధిపై సమీక్ష
ములుగు, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): మేడారం మహా జాతర అందరూ పట్టుదలతో పనిచేయడం వల్లే విజయవంతమైంద ని, మేడారంలో భక్తులకు సౌకర్యాలు కల్పిం చే విషయం నిరంతర ప్రక్రియ అని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ములుగు జిల్లా తాడ్వా యి మండలం మేడారం సమ్మక సారలమ్మలను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తో కలిసి దర్శించుకున్నారు.
ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మేడారంలోని హరిత హోటల్‌లో అధికారులతో మేడారం అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా నిరంతరం ఏర్పా ట్లు చేస్తూనే ఉండాలని, ముఖ్యంగా పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాలని సూచిం చారు.
మేడారం జాతరకు ముందే 95 శాతం వరకు అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మిగిలన ఐదు శాతం పనులను సైతం వెంటనే పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్‌రామ్ నాథ్ కేకన్, డిఎఫ్‌ఓ రాహూల్ కిషన్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.




