17 April, 2026 | 3:27 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఏసీబీకి చిక్కిన హోంగార్డు, వైద్యుడు

01-03-2026 12:00 AM

కీసర పోలీస్ స్టేషన్‌లో దాడులు 

మేడ్చల్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి) : కీసర పోలీస్ స్టేషన్‌లో హోంగార్డు నగేష్ రూ.35 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు. తోటకూర మహేష్ అనే వ్యక్తి నాలుగు నెలల క్రితం చనిపోయాడు. మృతుడి పోస్టుమార్టం రిపోర్టు కోసం ఆయన మేనల్లుడు నాలుగు నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. హోంగార్డు నాగేష్ రూ.2 లక్షలు లంచం ఇస్తే నే పోస్ట్‌మార్టం రిపోర్టు వస్తుందని, గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ సందీప్‌కు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు.

దీంతో బాధితుడు హోంగార్డు నగేష్ తో రూ.40 వేలకు ఒ ప్పందం చేసుకున్నాడు. మొదటి విడత రూ.5 వేలు చెల్లించాడు. రెండో విడత రూ.35 వేలు ఇచ్చే సమయంలో ఏసీబీ అధికారులను ఆశ్రయిం చాడు.  అధికారులు ఇచ్చిన సూ చన మేరకు శనివారం హోంగార్డు నగేష్‌కు శనివారం బాధితుడు డబ్బులు అందజేస్తుండగా పట్టుకున్నారు.  హోం గార్డు నగేష్‌తో పాటు డాక్టర్ సందీప్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.