కోదండరాంను కలిసిన నీలం మధు
22-04-2024 12:50 AM
పటాన్‌చెరు, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి) : తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండ రాంను కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆదివా రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇందుకు కోదండరాం తన సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు నీలం మధు తెలిపా రు. మెదక్ జిల్లాలోని ప్రజా సంఘా లన్నింటినీ ఏకం చేసి, తన గెలుపున కు కృషి చేస్తామని చెప్పారన్నారు. కార్యక్రమంలో పటాన్‌చెరు నియోజ కవర్గ అసెంబ్లీ ఇన్‌ఛార్జి హనుమంత రెడ్డి, టీజేఎస్ నేతలు రమేశ్, అంబ టిశ్రీనివాస్ పాల్గొన్నారు.






