ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు
నారాయణఖేడ్, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్ద శంకరంపేట మండలంలోని మూసపేట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎంపీ అభ్యర్థి సురేశ్‌షెట్కార్ సమక్షంలో పదిహేను కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్శితులు అవుతున్నారన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో సురేశ్ షెట్కార్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు.
పార్టీలో చేరిన వారిలో పీఏసీఎస్ డైరెక్టర్ కొంగొండ కిష్టయ్య, మాజీ విద్యాకమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మైనార్టీ సంఘం చైర్మన్ దస్తగిరి, మాజీ వార్డు సభ్యులు తలారిమల్లేశం, రజక సంఘం అధ్యక్షుడు కేశయ్య, అంజయ్య, నర్సింహులు, జోడు రాములు, గొండ్ల సంగయ్య, పన్యాల సాయిలు, వడ్డెఇస్తారి చేరారు. కార్యక్రమంలో నాయకులు నారాగౌడ్, అంజిరెడ్డి, సాయిరెడ్డి, మాజీ ఎంపీటీసీ జైహింద్‌రెడ్డి, మాజీ ఆత్మ చైర్మన్ సంగయ్య, సుభాస్‌సేట్, దుర్గయ్య, హరిప్రసాద్‌రెడ్డి, షాదుల్, సాయిలు పాల్గొన్నారు.






