10 July, 2026 | 6:17 AM

ఆన్‌లైన్‌లో నీట్ పరీక్ష?

01-07-2024 12:41 AM

న్యూఢిల్లీ, జూన్ 30: నీట్ యూజీ పేపర్ లీక్‌తో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు తేవాలని భావిస్తున్నది. అందులో భాగంగా నీట్ యూజీ, పీజీ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్టుల (సీబీటీ) విధానంలో నిర్వహించాలని సమా లోచనలు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే వాయిదా వేసిన కొన్ని పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ కొత్త తేదీలను ప్రకటించింది. సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షలు జూలై 25 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. యూజీసీ నెట్ పరీక్షలు ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తారు. పేపర్ల లీకేజీలను అరికట్టేందుకు జరుగబోయే ఆరు పరీక్షలను, వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షలను సీబీటీ విధానంలో జరుపను న్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.