10 July, 2026 | 7:24 AM

115 మంది ప్రొఫెసర్లపై వేటు

01-07-2024 12:05 AM

న్యూఢిల్లీ, జూన్ 30 : టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)కు సంబంధించి నాలుగు క్యాంపస్‌లలో ఒకేసారి 115 మంది సిబ్బందిపై వేటు పడటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 55 మంది ప్రొఫెసర్లు, 60 మంది నాన్ టీచింగ్ స్టాఫ్‌ని ఎలాంటి నోటీసులు లేకుండా అకస్మాత్తుగా తొలగించారు. గౌహతి, ముంబై, హైదరాబాద్, తుల్జాపూర్ క్యాంపస్‌లలో ఈ తొలగింపులు జరిగాయి. టాటా ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి టిస్‌కు ప్రతి ఏటా నిధులు విడుదలవుతాయి. అయితే, ఈ ఏడాది నిధులు ఆగిపోవడం వల్లే సిబ్బందిని తొలగించినట్లు తెలుస్తోంది. ఉన్నత ప్రమాణాలు పాటించే టాటా సంస్థలో ఎలాంటి నోటీసులు లేకుండా ఉద్యోగులను తొలగించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.