6 July, 2026 | 8:19 AM

ఫీజు రీయింబర్స్‌మెంట్ పై నిర్లక్ష్యం

30-08-2024 12:52 AM
  1. బోధనా ఫీజుల బకాయిలు 5,900 కోట్లు 
  2. రైతులను అవమానిస్తున్న సర్కార్ 
  3. చైనాకు చెందిన బీవైడీ సంస్థపై అంత ప్రేమెందుకు 
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఫీజు యింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్‌ల విషయంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ మండిపడ్డారు. గురువారం ఎక్స్ వేదికగా వెల్లడిస్తూ ఫీజల బకాయిలు రూ. 5,900 కోట్లకు చేరుకున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఈ ఏడాది స్కాలర్‌షిప్‌ల దరఖా స్తులకూ దిక్కులేని పరిస్థితి తెచ్చారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులంటే ఎందుకంత చిన్నచూపని ప్రశ్నించారు.

స్కాలర్‌షిప్‌లు రాక పేద విద్యార్థులు చదువు మానేసి కూలీ పనిచేసే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. వసతిగృహాల్లో నిర్వహణ చార్జీలు కూడా రావడం లేదన్నారు. ప్రభుత్వ వైఖరితో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి తలెత్తుతుందని, దానికి కాంగ్రెస్ పాలకులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే బోధనా బకాయిలు, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

 రైతులను అవమానిస్తున్న సర్కార్

 రుణమాఫీ కానీ రైతులను రేవంత్ సర్కార్ అవమానిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. సెల్ప్ డిక్లరేషన్ పేరుతో కొత్త డ్రామా మొదలుపెట్టిందని, ఇచ్చేది పక్కనపెట్టి వాపస్‌పై దృష్టి పెట్టిందన్నారు. రుణమాఫీకి వంద ల కొర్రీలు పెట్టడంతో సెల్ఫీ దిగి తాను రైతు అని నిరూపించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు రుణమాఫీ చేయలేక ప్రభుత్వం నయా డ్రామా లు షూరు చేసిందన్నారు. 

అప్పుడు వద్దని.. ఇప్పుడెందుకు రెడ్ కార్పెట్

 తెలంగాణలో  పెట్టుబడులు పెట్టడానికి ఆటోమేకర్ సంస్థను మళ్లీ ఆహ్వానించిన కేంద్రప్రభుత్వ తీరు పట్ల కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  చైనాకు చెందిన బీవైడీ రాష్ట్రంలో బిలియన్ డాలర్ల పెట్టుబడితో తమ ఫ్యాక్ట రీ ఏర్పాటు చేయాలని చూస్తే కేంద్రం వ్యతిరేకించిందన్నారు. బీవైడీతో వేలా ది మందికి ఉపాధి అవకాశాలు లభి ంచేవని తెలిపారు. అప్పుడు వద్దనుకున్న కంపెనీని ఇప్పుడు ఎందుకు మళ్లీ ఆహ్వానిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పుడు ఏం మారిం దని ప్రశ్నించారు. అనుమతించటానికి కారణాలేంటో చెప్పాలన్నారు.