15 March, 2026 | 2:41 PM

జూబ్లీ హిల్స్‌లో నేపాలీ దంపతులు చోరీ

15-03-2026 01:57 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీ పాల్పడింది. జూబ్లీహిల్స్‌లోని తమ పని చేస్తున్న యజమానుల ఇంట్లోన ఓ నేపాలీ దంపతులు రూ. 2 కోట్ల విలువైన ఆభరణాలను, ఇతర విలువైన వస్తువులను దొంగిలించారు. ప్రముఖ వ్యాపారవేత్త అనిరుధ్ రెడ్డి, ఆయన భార్య జూబ్లీహిల్స్ రోడ్ నం. 25లో నివసిస్తున్నారు. గత 45 రోజుల క్రితమే నేపాలీ దంపతులను  తమ ఇంట్లో పనివారిగా నియమించుకున్నారు. తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ, ఆ దంపతులు ఇంటి యజమానుల నమ్మకాన్ని చూరగొన్నారు. శనివారం రాత్రి అనిరుధ్ రెడ్డి, ఆయన భార్య నిద్రిస్తున్న సమయంలో, ఆ నేపాలీ దంపతులు లాకర్‌ను పగులగొట్టి, 8 డైమండ్ నెక్లెస్లు, బంగారు ఆభరణాలు, 10 రోలెక్స్ వాచీలను దోచుకుని పరారయ్యారు.

 ఆదివారం ఉదయం లాకర్ తెరిచి ఉండటాన్ని గమనించిన ఆ దంపతులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటన స్థలానికి చేసుకున్న పోలీసులు కీలక ఆధారాలను సేకరించేందుకు సీసీటీవీ కెమెరా దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ నేపాలీ జాతీయులకు సంబంధించిన సమాచారాన్ని నగర శివారు ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు పంపించారు. పనిమనుషులు లేదా గృహ సహాయకులను పనిలో చేర్చుకునే ముందు, వారి ఆధార్ కార్డులను తప్పక సరిచూసుకోవాలని పోలీసులు యజమానులకు సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.